
మెదక్, వెలుగు: రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల కలెక్టర్ల, ఇంజినీరింగ్ అధికారుల చర్చ కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన వంద మంది కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ, నేషనల్ హైవేలపై ఇంకా తీసుకోవలసిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు.